వైసీపీ నాలుగున్నరేళ్ళ పాలనలో చేపట్టిన సామాజిక సాధికారత గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. 175 నియోజక వర్గాల్లో ఈ యాత్ర జరుగుతుంది.. వైసీపీ పెత్తందార్ల పార్టీ కాదు ప్రజల పార్టీ అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హయాంలో సామాన్య ప్రజలకు చేసింది ఏం లేదు అని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడు.. ఆయన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
Read Also: Travis Head: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన రికార్డ్
చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కి లేవు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను చూసి ప్రతి పక్షాలు ఓర్వలేక పోతున్నాయి.. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు.. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు.. ఆమెకి సిద్దాంతాలు, నైతిక విలువలు లేవు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ ప్రయోజనాలకు, తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది.. పురంధేశ్వరి అరోపరణలు అర్థరహితమైనవి.. నాపై, మిథున రెడ్డిపై పురంధేశ్వరి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.. పురంధేశ్వరి మందు తాగుతారో లేదో నాకు తెలియదు గానీ నాకు మద్యం అలవాటు అయితే లేదు.. వాటి బ్రాండ్లు కూడా నాకు తెలియవు.. నేను తప్పు చేస్తే ఆ భగవంతుడే శిక్షిస్తాడు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.