రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. నల్లొండ లోకసభ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతులు సమర్పించారు. డోర్నకల్ నుంచి మిర్యాలగూడకు వయా నేలకొండపల్లి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచెర్ల మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ మార్గంలో రైస్ మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయని, ఆర్థికంగా రైల్వేకు ఈ మార్గం లాభదాయకమని సూచించిన ఉత్తమ్.. ఈ ప్రతిపాదిత కొత్త లైన్ గురించి ఇప్పటికే సర్వే జరిగిందని, త్వరగా “డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్” (డీపీఆర్) పూర్తి చేయించాలని కోరారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్ ఇదే..!
మోటమర్రి – జగ్గయ్యపేట – మేళ్లచెరువు – జాన్‌పాడు – వాడపల్లి – విష్ణుపురం మార్గంలో ప్రయాణికుల రైళ్లను ప్రవేశపెట్టాలని మరో వినతిని సమర్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ మార్గంలో “మైహోం సిమెంట్స్” సహా, పలు సిమెంట్ కంపెనీలు ఉన్నాయని, కార్మికులు, ప్రజల రాకపోకలకు ఈ మార్గం ఉపయోగపడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే మార్గంలో 4,000 మెగావాట్ల “యాదాద్రి పవర్ ప్లాంట్” ఏర్పాటు కాబోతుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని డబ్లింగ్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. త్వరలో ప్రారంభించనున్న “సికింద్రాబాద్ – తిరుపతి” వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు తన నియోజకవర్గం మీదుగా ప్రయాణించే నారాయణాద్రి, విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు నల్గొండ, భువనగిరి పట్టణాల్లో ‘హాల్ట్’ ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కేంద్ర మంత్రిని కోరారు.
Also Read : Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?