Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి ప్రజాప్రతినిధులు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూర్చిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ఇక, మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ జరుగుతందని తెలిపారు. మా పార్టీ సైనికులు గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఏడు లక్షల మంది.. 14 రోజుల్లో కోటి 80 లక్షల ఇళ్లను సందర్శిస్తారు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా వెళ్తారు.. 10 నిమిషాల పాటు వారితో మాట్లాడతారు.. వైఎస్ జగన్ తరపున ప్రజల నుంచి మద్దతు కోరతారు.. గత ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మీకు జరిగిన లబ్ది ఏంటి? అని అడుగుతారు వెల్లడించారు.
Read Also: Actor Akanksha Dubey Case: భోజ్‌పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్‌లో ప్రజా మద్దతు పేరుతో ప్రజా అభిప్రాయం సేకరిస్తారని తెలిపారు సజ్జల.. ముఖ్యంగా ఐదు ప్రశ్నలు వేస్తారు.. దీనిలోనే జగన్ పట్ల ప్రజా మద్దతు తెలిసిపోతుందన్న ఆయన.. 82960 82960 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అడుగుతారు.. వారికి సీఎం వైఎస్ జగన్ వాయిస్ తో ధన్యవాదాల మెసేజ్ వెళ్తుందన్నారు. ఇక, అభ్యంతరం లేకపోతే ఇంటికి, మొబైల్ ఫోన్ కు పెట్టుకోవటానికి స్టిక్కర్ ఇస్తారని పేర్కొన్నారు. ఇంత వరకు ఇంత విస్తృతంగా ప్రతి గడపను తట్టే విధంగా ప్రజా మద్దతును కోరే రాజకీయ కార్యక్రమం జరుగలేదన్న సజ్జల.. దీంతో.. ప్రతిపక్షాల నోళ్లు మూతబడతాయన్నారు.. మన శరీరంలో నాడీ వ్యవస్థలా పార్టీకి కీలకమైన పాత్రను గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వ్యవహరించనున్నారని తెలిపారు. జన్మభూమి కమిటీలపై మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో సవాలు చేశాం.. టీడీపీ జన్మభూమి కమిటీలు ప్రజలను జలగల్లా పీల్చారని మండిపడ్డారు.. కానీ, మా వాలంటీర్ వ్యవస్థ పారదర్శకంగా పథకాలను ప్రజలకు అందిస్తోంది.. ప్రభుత్వం, అధికార పార్టీ ఒకటే అని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.