Botsa Satyanarayana: చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్.. ఆయనది నాలుకా, తాటిమట్టా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఎంతసేపు సీఎం జగన్ పై నిందలు, విమర్శలు చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరి పనైపోయిందో వచ్చే ఎన్నికలే చెబుతాయన్నారు.
కొద్దో గొప్పో టీడీపీకి ఉన్న ఉనికి వచ్చే ఎన్నికల్లో పోవడం ఖాయమని బొత్స పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది నాటి సీఎం వైఎస్సార్ హయాంలోనే అన్నది టీడీపీకి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ అభివృద్ధిని సీఎం జగన్ కొనసాగిస్తున్నారన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఆయనది నాలుకా, తాటిమట్టా అంటూ మండిపడ్డారు. రుషికొండ బోడి కొండ చేశారని పదే పదే విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అక్కడ ఏమైనా ప్రైవేట్ కట్టడాలు, లేదంటే తాము వ్యక్తిగత కట్టడాలు ఏమైనా చేస్తున్నామా.. ప్రభుత్వ కట్టడాలకే కదా ఉపయోగిస్తోంది…అభివృద్ధి చేయడం తప్పా.. అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి ఓటు అని ప్రశ్నలు గుప్పించారు. పేదవాడి ఆకలి మీద రాజకీయాలు చేసే చరిత్ర చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.
Also Read
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Read Also: AP CM Jagan: స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
దేశంలోనే అత్యధిక జీడీపీ పెరిగిన రాష్ట్రం ఏపీ అని.. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచిన ప్రభుత్వం మాది అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం… ఈ నాలుగు అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ నాలుగు అంశాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు పనైపోయిందని.. గ్రామాల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యం ఆయనకు ఉందా అంటూ బొత్స ఎద్దేవా చేశారు. జనసేన ఓ సెలెబ్రెటీ పార్టీ.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు ఆ పార్టీకి లేవన్నారు. గత ఏడాది జరిగిన పరిణామాలతో …ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పరీక్షలను కూడా రాజకీయాలకు వాడుకుందామనుకుంటే అంతకన్నా నీచమైన పని ఉండదన్నారు.
తాజావార్తలు
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!