ఏపీలోని అమరావతిలో జరిగిన పరిణామాలు వైసీపీ, బీజేపీ మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అమరావతిలో దాడిపై మాట్లాడారు. మూడు రాజధానుల శిబిరంలో ఉన్నవాళ్లపై ఆదినారాయణ రెడ్డి మనుషులే దాడి చేశారు. దళితుల మీద.. మహిళల మీద ఆదినారాయణ రెడ్డి మనుషులు విచక్షణా రహితంగా దాడి చేశారు. అమరావతి రైతుల టెంటులో ఆదినారాయణ రెడ్డి సీఎం జగనుపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మూడు రాజధానుల టెంట్ వద్దకు వచ్చి కవ్వించారు. సత్యకుమార్ కారులో కూర్చొని వెకిలిగా నవ్వాడన్నారు ఎంపీ నందిగం సురేష్.
Read Also: April Fools’ Day: ఏప్రిల్ ఫూల్స్ డే.. అసలు ఎలా పుట్టింది..? దాని వెనక ఉన్న కథేంటి..?
అసలైన బీజేపీ ఈ విధంగా చేయదు.చంద్రబాబు డైరెక్షనులో ఆదినారాయణ రెడ్డే ఈ విధంగా చేశారు.అసలు గొడవకు మూలకారణం ఆదినారాయణ రెడ్డే.. అతనేమయ్యాడని అడిగిన మాట వాస్తవమే.సత్యకుమార్ అనవసరంగా ఈ వ్యవహారాన్ని తనపై వేసుకుంటున్నాడు.1200 రోజుల నుంచి మేమేనాడైనా అమరావతి టెంట్ వద్దకు వెళ్లామా..?పథకం ప్రకారం మనుషులతో వచ్చి కవ్వించారు.ఈ దాడిపై మేం పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం.పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి.. వాస్తవాలు నిగ్గు తేల్చాలి. మరోవైపు
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ నేతలపై మండిపడ్డారు. బీజేపీపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీపై వైసీపీ దాడికి పాల్పడింది.బీజేపీ నేతలపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి. పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే దాడి చేశారు. దాడులకు బీజేపీ భయపడదన్నారు సోము వీర్రాజు.
Read Also: Brad Pitt: అందుకేనా…బ్రాడ్ పిట్ ఇల్లు అమ్ముతోంది!?