Brad Pitt: అందుకేనా…బ్రాడ్ పిట్ ఇల్లు అమ్ముతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brad Pitt: అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు బ్రాడ్ పిట్. ఏంజెలినా జోలీతో విడిపోయిన దగ్గర నుంచీ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. అంటే దానర్థం మరెవరినీ పెళ్ళి చేసుకోలేదనే. అంతే కానీ, అమ్మాయిలతో కాలక్షేపం చేయడం మాత్రం మానలేదు. ఈ అందగాడు లాస్ ఫెలిజ్ లోని తన విలాసవంతమైన భవనాన్ని అమ్మేస్తున్నాడట! దాదాపు రెండు ఎకరాలు ఉండే ఆ స్థలాన్ని 40 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.329 కోట్ల రూపాయలట! అదే భవనంలోనే బ్రాడ్ పిట్, అతని మాజీ భార్య ఏంజెలినా జోలీ తమ ఆరుమంది పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారి కోసమే బ్రాడ్ తన ఇంటిని అమ్ముతున్నట్టు సమాచారం!
Raviteja: వాడికి సలహాలు ఇవ్వను.. అసలు నాకు సంబంధం కూడా లేదు
Also Read
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
- Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ఏంజెలినా జోలీతో బ్రాడ్ పిట్ విడాకులు 2019లోనే తీసుకున్నాడు. అయినప్పటికీ తమ పిల్లల కోసం వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. పిల్లలను జీవితంలో పైకి తీసుకు రావాలనే ఒప్పందంతోనే తమ ఉమ్మడి ఆస్తులను అమ్మే దిశగా సాగుతున్నారని సమాచారం. లాస్ ఫెలిజ్ లోని భవంతి అమ్మకం కాగానే, తాము ఎంతో ఇష్టపడి కొన్న ‘షెటావు మారివల్ ఎస్టేట్’ను కూడా అమ్మకానికి పెట్టనున్నారని తెలుస్తోంది. అది కూడా మంచి రేటుకు పోతే, పిల్లలకు ఒక్కొక్కరికి మన కరెన్సీలో వంద కోట్లయినా ఇవ్వాలని బ్రాడ్, ఏంజెలినా నిర్ణయించారని వినికిడి. బ్రాడ్ తన ఇల్లు అమ్మేసిన తరువాత లాస్ ఏంజెలిస్ లో ఏదైనా చిన్న ఇంట్లోకి మకాం మార్చనున్నట్టు తెలుస్తోంది. అక్కడే బ్రాడ్ పిట్ తన ప్రేమాయణాలూ సాగిస్తాడనీ హాలీవుడ్ జనం అంటున్నారు.
తాజావార్తలు
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!