MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: అమరావతి అభివృద్ధికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మదనపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం తప్ప అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అడ్డుకుందని విమర్శించారు. మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తైతే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్ బ్యాంక్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన మిథున్ రెడ్డి, ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలే సమాచారం అందించారని తెలిపారు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలలు, భూకబ్జాలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్యపరుస్తామని ఆయన అన్నారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తప్ప సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
డీఎస్సీ పరీక్షల వ్యవహారంపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని పక్కన పెట్టడంతోనే లీకేజీ వ్యవహారం బయటపడిందని అన్నారు. పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాల్సిన పరిస్థితిలో అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మామిడి రైతులు కూటమి ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయారని మిథున్ రెడ్డి ఆరోపించారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. అలాగే ఆక్వా రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!