Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill React on India Test win vs Sri Lanka: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్‌గా నిలిచిన ఈ టెస్టులో విజయం సాధించడం జట్టుకు ప్రత్యేకంగా మారింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు కీలక పాయింట్లు దక్కాయి. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. 600వ టెస్టులో విజయం సాధించడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. భారత్‌కు 600వ టెస్టు మ్యాచ్‌లో విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
‘600వ టెస్టు మ్యాచ్‌లో విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంను ఎప్పటికీ మర్చిపోలేను. వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? లేదా? అనే సందేహం ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నారు. మ్యాచ్‌లో ఒక దశలో టీమిండియా ఆధిపత్యంలో ఉన్నప్పటికీ.. పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. అయినా మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా కొన్ని వికెట్లు కోల్పోయినా ఆందోళన చెందలేదు. 400 పరుగులు చేయాలనే లక్ష్యంతో బ్యాటర్లు దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నారు. పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభంగా లేకపోవడంతో.. వీలైనన్ని ఓవర్లు శ్రీలంకకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో భారత్ వేగంగా పరుగులు చేయాలని ప్రయత్నించించింది. ఈ క్రమంలో కొన్ని వికెట్లు కోల్పోయాము, అయినప్పటికీ మేము మంచి స్థితిలోనే ఉన్నాము’ అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
శ్రీలంకపై భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. ‘మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్ నుంచే తన ప్రతిభను చూపిస్తున్నాడు. సుతార్‌లో మంచి టాలెంట్ ఉంది. అతడు చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందిస్తాడు’ అని చెప్పాడు. గాలె టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మానవ్ ఆరు వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు.. మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు సాధించి భారత్ విజయంలో కీలకంగా నిలిచాడు.
భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ప్రదర్శనను కూడా శుభ్‌మన్ గిల్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘సెంచరీ చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. శతకం తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తూ భారీ స్కోరు సాధించడం అతడి ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత. ఇలాంటి ప్రదర్శనలే పోటీగా ఉన్న మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మారుస్తాయి’ అని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 167 పరుగులతో అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 పరుగులు చేసాడు. స్పిన్నర్లపై అతడు ఆధిపత్యం చెలాయించిన తీరు చూడటానికి ఎంతో బాగుందని గిల్ అభిప్రాయపడ్డాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడమే తమ లక్ష్యమని శుభ్‌మన్ గిల్ చెప్పాడు. టెస్టుల్లో విజయాలు అంత సులభంగా రావని, అందుకే శ్రీలంకపై సాధించిన ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. 600వ టెస్టులో విజయం, డబ్ల్యూటీసీ పాయింట్లు, యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో గాలె టెస్టు టీమిండియాకు అన్ని విధాలా ప్రత్యేకంగా నిలిచింది. అందుకే గిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?