School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువ అవుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా.. లేదా ఏదైనా కొత్త ఏరియాకు వెళ్లినా.. కుక్కలను చూసి భయపడాల్సిన పరిస్థితి.. అయితే, కుక్కుల భయంతో 10 స్కూల్స్‌కు సెలవులు ఇవ్వడం సంచలనంగా మారంది.. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా నారాయణబగడ్ ప్రాంతంలో వీధి కుక్కలు, హింసాత్మక కుక్కల బెడద పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు.
ఆగస్టు 20 నుంచి 23 వరకు పాఠశాలలకు సెలవులు
చమోలీ ముఖ్య విద్యాధికారి ఆకాష్ సరస్వత్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలకు ఆగస్టు 20, 2026 నుంచి ఆగస్టు 23, 2026 వరకు సెలవులు ప్రకటించారు. ఈ కాలంలో విద్యార్థులను పాఠశాలలకు రప్పించకుండా చూడాలని ఆదేశించారు. అయితే, పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నాలుగు రోజుల పాటు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఒకవైపు పిల్లల భద్రతను కాపాడుతూనే, మరోవైపు వారి విద్య కొనసాగించేలా చర్యలు చేపట్టారు.
Also Read
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో నిర్ణయం
నారాయణబగడ్ ప్రాంతంలో కుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఏరియా పంచాయతీ అధిపతి అధికారులకు లేఖ రాశారు. ఈ విషయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే, వీధి కుక్కలు, హింసాత్మక కుక్కల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలకు వర్తించనున్నాయి. మొత్తంగా కుక్కల సమస్య నియంత్రణలోకి వచ్చిన తర్వాత పాఠశాలలను సాధారణంగా నిర్వహించే అవకాశం ఉంది. అప్పటివరకు విద్యార్థులు ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యను కొనసాగించనున్నారు.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు