తుఫాన్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని వైసీపీ మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదన్నారు. నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా? అని వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల…
Tomato Farmers in Crisis: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం ఏపీలో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.
ఏపీలో యూరియా కొరత, రైతుల సమస్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు.. కానీ రైతులకు సులభంగా దొరికే యూరియా బస్తానే ఇవ్వలేక పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అంటూ విమర్శలు గుప్పించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే..బస్తా యూరియా…
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
పొగాకు కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన 25 మిలియన్ కేజీల పొగాకు ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డ్ ల నుంచి పొగాకు కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు నల్లబెల్లి పొగాకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు.
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార…