Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- కంగనా రనౌత్- రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం
- పరస్పరం మాటల-తూటాలు
- యోగా గురువుపై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్-యోగా గురువు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరస్పరం మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇటీవల జెన్-జీని ఉద్దేశించి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మురికి కాలువ తరం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
ఇక కంగనా రనౌత్ వ్యాఖ్యలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ తీవ్రంగా స్పందించారు. “ఆమె బాల్యం ఎలా ఉండేది? ఆమె యవ్వనం ఎలా ఉండేది? ఆమె గత విజయాలు ఎలా ఉండేవి? నేను అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆమెది కలుషితమైన మనస్తత్వం.” అని వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ఈ వ్యాఖ్యలే కంగనాకు కోపం తెప్పించాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా బాబా రామ్‌దేవ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన వ్యక్తిగత జీవితంపై నిరాధారమైన ఊహాగానాలు చేస్తున్నారని.. అంతేకాకుండా తన నడవడికపై గురించి మాట్లాడే నైతిక అధికారం ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. “బాబాజీ.. నా యవ్వనం లేదా పడకగది గురించి పగటి కలలు కనకండి. పుకార్లు, గాసిప్‌ల ఆధారంగా మాత్రమే ఊహించుకోవచ్చు. కనీసం తప్పుడు/మోసపూరిత వాదనల కోసం నన్ను సుప్రీంకోర్టు ఎప్పుడూ మందలించలేదు… ఇది కఠినమైన వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. గాసిప్‌లు లేదా ఊహాగానాలపై కాదు..’’ అంటూ కంగనా బదులిచ్చారు. ‘‘అయినా నా నడవడిక గురించి పాఠాలు చెప్పకండి.. నా నడవడిక మీకంటే చాలా ఉత్తమం. ఇక్కడ ఎలాంటి మోసం కనుగొనబడలేదు. సుప్రీంకోర్టుతో ఎప్పుడూ చీవాట్లు తినలేదు” అంటూ కంగనా మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ మళ్లీ ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.

తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!