జేమ్స్ కమరూన్ డైరెక్ట్ చేసిన అవతార్ 2 సినిమా ఆడియన్స్ కి బిగ్గెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా 3Dలో అవతార్ 2 సినిమా చూసిన వాళ్లు… ఆ వాటర్ వరల్డ్ కి, స్టన్నింగ్ యాక్షన్స్ ఎపిసోడ్స్ కి ఫిదా అయ్యారు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య డిసెంబర్ 16 ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చింది ‘అవతార్ 2’. ఇప్పటివరకూ వరల్డ్ వైడ్ 11,950 కోట్లు రాబట్టిన అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ అయ్యి హ్యుజ్ ప్రాఫిట్స్ వైపు ట్రావెల్ చేస్తోంది. అయితే అమెరికాలో మంచు తుఫాను, చైనాలో కరోనా విజృంభించడంతో బాక్సాఫీస్ దగ్గర స్లో అయ్యింది. ఫారిన్ కంట్రీస్ లో పై కారణాల వలన అవతార్ 2 సినిమా బాక్సాఫీస్ రన్ కష్టంగా మారింది కానీ ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 సినిమా కలెక్షన్స్ కి ఎండ్ కార్డ్ వేసింది మాత్రం ఒక్క హీరోనే.
అవతార్ 2 సినిమా ఇండియాలో ఓవరాల్ గా 410 కోట్లు రాబట్టింది, ఇందులో 91కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. అయితే ఆంధ్రా తెలంగాణా ప్రాంతాల్లో అవతార్ 2 సినిమాని వంద కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వకుండా చేశాడు మాస్ మహారాజా రవితేజ. అవతార్ 2 రిలీజ్ అయిన వారానికే రవితేజ ‘ధమాకా’ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో ఎవరూ ఊహించని రేంజులో కలెక్షన్స్ ని రాబడుతోంది. నిజానికి అవతార్ 2 సినిమా దెబ్బకి ఆ తర్వాత రెండు మూడు వారల పాటు ఏ సినిమా రిలీజ్ అయినా దానికి మినిమమ్ కలెక్షన్స్ కూడా రావని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ అంచనాలని తలకిందులు చేస్తూ అవతార్ 2 అనే పేరుని కూడా తెలుగు రాష్ట్రాల్లో వినిపించకుండా చేసింది ‘ధమాకా’. హిట్ టాక్ తో, హౌజ్ ఫుల్ షోస్ తో దూసుకుపోతున్న ధమాకా సినిమా ఇప్పటివరకూ 100 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ ధమాకా సినిమా రిలీజ్ కాకపోయి ఉంటే అవతార్ 2 సినిమా కూడా వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యి ఉండేది.