MP K.Laxman : బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెహ్రూ నుండి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు ఓబీసీ లకి, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా మోడీ కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టారన్నారు. బీసీల ప్రయోజనాలను నెహ్రూ ఫ్యామిలీ అణచివేసిందని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రశ్నలకి రాహుల్ గాంధీ తో సహా ఎవరు సమాధానం చెప్పలేదని, కాంగ్రెస్ అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ ఓట్ల కోసం తాపత్రయ పడుతున్నదన్నారు లక్ష్మణ్. మోడీ నీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, కర్పూరీ ఠాకూర్,చరణ్ సింగ్, పీవీ నరసింహా రావు కి భారత రత్న ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందన్నారు లక్ష్మణ్. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది చెప్పలేదని, హిందువులను ఆ పార్టీ అవమానించిందన్నారు ఎంపీ లక్ష్మణ్. హిందువుల ను, దేవి దేవతలను అవమంచడమే సెక్యులరిజం అని ఆ పార్టీ భావిస్తోందని ఆయన మండిపడ్డారు.
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అసదుద్దీన్ అసలైన మతతత్వ వాది అని, హిందత్వం కోసం పనిచేస్తున్న ఏ వర్గాలను మోడీ ప్రభుత్వం విస్మరించలేదన్నారు లక్ష్మణ్. BRS కేశవ రావు కూడా అయోధ్య రామ మందిరం పై పార్లమెంట్ లో చర్చిస్తే తప్పు పడుతున్నారన్నారు. వీళ్లకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందని అన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఆరోపించారు. రాముడు మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని.. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Bihar Floor Test: బలపరీక్షకు ముందు స్పీకర్ తొలగింపు.. ఎన్డీయేలోకి విపక్ష ఎమ్మెల్యేలు
తాజావార్తలు
-
Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!