Site icon NTV Telugu

Etala Rajender: ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ ఈటల రాజేందర్..

Etala Rajender

Etala Rajender

రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని… 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్‌ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తన ఫోన్ టాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ తో లాలూచి పడక పోతే నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రిటైర్డ్ అయ్యాక కూడా ప్రభాకర్ రావు కు పదవి కట్టబెట్టారని.. ప్రభాకర్ రావు ను అక్రమంగా ఎస్‌ఐబీలో నియమించారన్నారు. ప్రణీత్ రావు, బుజంగారావు, రాదా కిషన్ రావు తిరుపతన్న వీళ్ళందరూ పైన ఉన్న అధికారులు ప్రమేయంతో పాటు నేతల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.

READ MORE: Bhatti Vikramarka: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం.. త్వరలో మరో 30 వేల ఉద్యోగాలు..!

“ప్రణీత్రావు, ప్రభాకర్ రావు, రాధా కిషన్రావు, శ్రవణ్ రావు వీళ్లంతా కూడా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లను కూడా ఫోన్ లను రికార్డ్ చేశారు. మరో రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన ఇంద్రాసేనారెడ్డి ఫోన్ కూడా టాప్ చేశారు.. ఎమ్మెల్యేల ఫోన్స్, మంత్రుల ఫోన్స్ సినిమా రంగానికి చెందిన వాళ్ళ ఫోన్స్ జడ్జ్ ల ఫోన్ టాప్ చేశారు. రాజ్యాంగం హక్కులను కాపాడాలంటే ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. చట్ట ప్రకారం వారిని శిక్షించాలి. లేకపోతే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌ తో కుమ్మక్కు అయినట్టే భావించాలి. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే దర్యాప్తు సక్రమంగా జరిపించాలి.లేదంటే ఫోన్ టాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి. ఎంతటి కేసునైనా సీబీఐ పరిష్కరిస్తుంది..” అని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

READ MORE: Chiranjeevi: మెగాస్టార్ తల్లి ఆరోగ్యంపై ఫేక్ న్యూస్.. వీడియో షేర్ చేసిన ఉపాసన!

Exit mobile version