High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే…
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని... 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు.
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
వక్ఫ్ సవరణ బిల్లుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు సహనం, వైవిధ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా అందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూనే, ఇమ్రాన్ మసూద్ తాజాగా ఏర్పడబోయే బోర్డు గురించి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారని, వారిలో 10 మంది మాత్రమే ముస్లింలు ఉంటారన్నారు. ఈ విధంగా.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర…
Ajay Singh Yadav : జై బాపు, జై సంవిధాన్ ప్రోగ్రాం కోసం ఇక్కడికి వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు జాతీయ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. కులగణన సిటీ స్కాన్ లాంటిదని, 46శాతం బీసీ లకు 10 శాతం WESకు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తోందన్నారు. కులగణన వలన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన…