విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్‌లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత…
Vijayasai Reddy: మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి (మార్చ్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.
కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పార్టీలో ఉండలేకే విజయసాయి రెడ్డి బయటకు వచ్చారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఏ2 విజయసాయి రెడ్డి, ఏ1 జగన్ రెడ్డి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్లు అప్పులు, తప్పులు చేశారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ ఓ డైనోసార్ అని, జగన్ సార్ బేకార్ అని విమర్శించారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు…
విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ దగ్గరకు వెళ్లకముందే.. ఎంపీ గురుమూర్తి.. సాయిరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.. రాజీనామా చేయొద్దని సాయి రెడ్డిని కోరాను అని.. కానీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి చెప్పడంలేదన్నారు.. మరోవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు ఎంపీ గురుమూర్తి..
ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని, తమది న్యూట్రల్ స్టాండ్ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇండియా కూటమి, ఎన్డీఏలకు తాము సమాన దూరం అని పేర్కొన్నారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ మీద పార్టీ అధ్యక్షుడు ఆలోచనలకు అనుగుణంగా జీపీసీ ఎదుట తమ అభిప్రాయం చెబుతాంని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల…
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు…
అరెస్టుకు భయపడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసుకున్నా తాను సిద్దం అని వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదానీతో సత్సంబంధాలు ఉన్నాయిని, తమపై ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి అత్యంత పరిపాలన దక్షుడని, రాష్ట్రంలో తాము ఇచ్చినంత జనరంజకమైన సంక్షేమ పాలన ఎవరూ ఇవ్వలేరన్నారు. సీఎం చంద్రబాబుకు లంచమిచ్చి కేవీ రావు కాకినాడ పోర్టును తీసుకున్నారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.…
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి…