Mother of 12 Children wants to Marry father of 10 in New york: ప్రస్తుతం ఒకరు, ఇద్దరు పిల్లల్ని కనాలంటేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మహిళల ఆరోగ్యాలు అందుకు సహకరించడం లేదు. ఎక్కువ మందిని కనాలంటే పురుషుడి ఆర్థిక స్తోమత కూడా అందుకు సరిపోవడం లేదు. దీంతో ప్రస్తుత కాలంలో ఒకరు ఇద్దరిని మాత్రమే కనాలని అంతా అనుకుంటున్నారు. వారి మంచి భవిష్యత్తు ఇస్తే చాలులే అనుకుంటున్నారు. వారిని పెంచడానికే తల్లి దండ్రుల తల ప్రాణం తోకకు వస్తుంది. అయితే ఇప్పుుడు చెప్పబోయే ఈ జంట మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.ఒక మహిళ తనకు 12 మంది పిల్లలు ఉన్నా ఇంకా పిల్లలను కనాలనుకుంటుంది. దాని కోసం ఏకంగా ఫేస్ బుక్ లోనే పోస్ట్ పెట్టింది. ఏకంగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఓ వరుడు కావాలని అయితే అతడికి ఇప్పటికే 10 మంది పిల్లలు ఉండాలని కండీషన్ పెట్టింది. అప్పుడు తన పిల్లలతో కలిసి మొత్తం 22 మంది అవుతారని కుటుంబం చాలా పెద్దది అవుతుందని, దేశంలో తమ కుటుంబమే పెద్దదిగా ఉండాలని తాను ఆశపడుతున్నట్లు ఆ మహిళ తెలిపింది.
Also Read: Health Tips: ఒంట్లో వేడి వేధిస్తుందా? ఈ చిట్కాలు పాటించండి
వివరాల్లోకి వెళ్తే న్యూయర్క్ కు చెందిన వెరోనికా అనే మహిళలకు ఇప్పటికే 12 మంది పిల్లలు ఉన్నారు. 14 ఏళ్ల వయసులోనే ఆమె తల్లయ్యింది. ఆ తరువాత వరుసగా పిల్లలను కంటూ వచ్చింది. ఇదిలా ఉండగా 2021లో ఆమె తన రెండవ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుుడ ఆమెకు 37 ఏళ్లు. ఈ వయసులో ఆమె మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అది కూడా కేవలం పిల్లలను కని వారి కుటుంబాన్ని దేశంలోనే అతి పెద్ద కుటుంబంగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే. దానికోసం 10 పిల్లలు ఆల్రెడీ ఉన్న తండ్రి తనకు మూడో భర్తగా కావాలని ఫేస్ బుక్ వేదికగా తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈమె ఏదో పిల్లల్ని కనడాన్ని ఓ ఉద్యమంలా పెట్టుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.