కుటుంబ కలహాలకు పిల్లలు బలవుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. సొంత తల్లి లేదా తండ్రి వారి ఉసురు తీసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారులను తండ్రి కర్కశంగా కడతేర్చాడు. అనంతరం సూసైడ్ చేసుకుంటున్నా అని లెటర్ రాసి పెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి మిస్సింగ్ కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. కలహాల కాపురానికి చిన్నారులు బలి.కలహాల కాపురానికి చిన్నారులు బలి.. ఇద్దరి గొడవల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.భార్య, భర్త…
అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేం.. నవ మాసాలు మోసి జన్మినిచ్చిన పిల్లల్ని అపురూపంగా చూసుకుంటుంది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది.. అలాంటి కన్న బిడ్డను తల్లి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు గురువారం వెలికి తీశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకును అపహరించారని ఆ తల్లి…