ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విధ్వంసకర బ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. అలాగే వార్నర్ చేసే రీల్స్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వార్నర్ వీడీయోస్ మిలియన్ వ్యూస్ రాబడుతుంటాయి. తెలుగు సినిమాలోని పాటలకు వార్నర్ స్టెప్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని పుష్ప సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్‌కు సంబంధించిన రీల్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్.
ఆ రీల్స్ లోని డేవిడ్ వార్నర్ నటన మనోడిని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేలా చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్. ఈ సినిమాల్లోని ఓ కీలక పాత్రలో డేవిడ్ వార్నర్ నటించాడు. ఆ విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్. ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్‘ కు వస్తున్న వార్నర్ కు భారత సినిమాకు స్వాగతం అనే ట్యాగ్ లైన్ పోస్టర్ ను జతచేచేసారు. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమా రాబిన్ హుడ్ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది.