రాజకీయంగా విభేదాలు ఉండటం సహజం కానీ ఒక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి విమర్శల ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పెత్తందారీ విధానం నుంచి వచ్చారు కాబట్టి అలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా జోగు రామన్న ఖండిచడం అభినందించదగిన విషయమేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశం లో బీసీ యాక్షన్ ప్లాన్ అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ సర్కార్ అని ఆయన అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఇంత చర్చ జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ లో చలనం లేకపోవడం సిగ్గు చేటని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ పై చేసిన వాక్యాలకు మహిళ కమిషన్ ఎలా స్పందించిందో అలాగే ముది రాజ్ ల పై వ్యాఖ్యలపై పాడి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.
Also Read : Anikha Surendran: బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తున్న ‘బుట్టబొమ్మ’.. వైట్ డ్రెస్సులో హాట్ షో
బీసీ ముదిరాజ్ (A) వర్గం లో చేర్చాలని నివేదికలు పంపించలేదని, 5 శాతం ఉన్న ఉన్నత వర్గాలు చెందిన పది మంది మంత్రులు ఉంటే 60 శాతం ఉన్న బలహీన వర్గాలకు చెందిన మంత్రులు ముగ్గురే అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఎందుకు..? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడం లో బీఆర్ఎస్ పార్టీ విఫలం అయ్యింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారన్నారు. బీఅర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా అందరూ కంకణం కట్టుకున్నారని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటే కర్ణాటక ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ గా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనడం అది ఒక్కప్పటి చరిత్ర అని, దేశంలో అవకాశ వాది పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, మునిగిపోయే నావ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప్రధాన మంత్రి వస్తే గౌరవించడం మన సంప్రదాయం కానీ గౌరవించడం మరిచి అమిష్ షా దగ్గర మొకరిల్లడం ఏమనుకోవాలన్నారు. మొన్నటి దాకా దాగుడు మూతలు ఆడారని, ఇప్పుడు తేట తెల్లం అవుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 60 స్థానాలు ఖరారు అయ్యాయన్నారు. ఎవరి స్థానల్లో వారు పని చేసుకుంటున్నారు.. త్వరలో అభ్యర్ధుల ను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.