ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల 2023 ఫలితాలు ఈరోజు మార్చి 16న వెల్లడికానున్నాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు గ్రాడ్యుయేట్ సీట్లు, రెండు టీచర్లు, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక స్థానానికి సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు కాగా.. ఉపాధ్యాయ నియోజకవర్గాలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు మరియు కడప-అనంతపురం-కర్నూలు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కర్నూలు (స్థానిక అధికారుల నియోజకవర్గాలు)లో కూడా పోలింగ్ జరిగింది.
Also Read : Delhi Liquor Policy: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పాత ఎక్సైజ్ పాలసీ 6 నెలలు పొడిగింపు
తెలంగాణలో పోలింగ్ జరిగిన ఏకైక ఉపాధ్యాయ నియోజకవర్గం మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడు ఉదయం ఎనిమిది గంటలకు నగరంలోని స్వర్ణభారతి స్టేడియంలో ప్రారంభమైంది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,924 మంది (69.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నిక బ్యాలెట్ విధానంలో జరిగినందున లెక్కింపునకు మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటుచేశారు. వాటికి ఎదురుగా ఎన్‌క్లోజర్లు పెట్టి అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. ఏఏ బూత్‌ల బాక్సులు ఏఏ టేబుల్‌పై లెక్కించాలో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు ఎన్‌క్లోజర్లపై స్టిక్కర్లు అతికించారు.
Also Read : Bandi sanjay: సరే ఆరోజే రండి.. బండి సంజయ్ లేఖపై స్పందించిన మహిళా కమీషన్