Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇక ఈ మధ్య లియో సినిమాలో నటించి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లియో. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని.. తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం అభిమానులను బాగానే అలరిస్తుంది. ఇక ఇందులో మడోన్నా.. విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో కనిపించింది. ఆంటోనీ దాస్ ( సంజయ్ దత్) జాతకాల పిచ్చితో కన్న కూతురు అయిన ఎలీషా దాస్ ను నరబలి ఇస్తాడు. చెల్లిని చంపిన తండ్రిని లియో దాస్ ఎలా మట్టుపెట్టాడు అనేదే ఈ సినిమా కథ.
Gentleman-2: జెంటిల్ మ్యాన్ 2.. అంతకు మించి ఉండబోతుందట
ఇక ఇందులో మడోన్నా చిన్న పాత్రనే చేసినా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మడోనా .. లియో సెట్ లో విజయ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ” చాలామంది లియో దాస్, ఎలీషా దాస్ ఫోటోలను అడుగుతున్నారు. అందుకే కొన్ని ఫోటోలు మీకోసం. ఇంకా ఉన్నాయి.. సందర్బానుసారం పోస్ట్ చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో విజయ్, మడోన్నా ఒకే డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. ఎలారా.. ఇంత అందాన్ని నరబలి ఇవ్వాలనిపించింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.