తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఈనేపథ్యంలోనే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసింది ఈసీ. అయితే.. తాజాగా తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై వికాస్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహారిస్తున్నారన్నారు. నేను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే… బీఆర్‌ఎస్‌వీ నేతల ద్వారా బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టె కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, బీఆర్‌ఎస్‌వీ ద్వారా మాపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.
Also Read : Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
సిద్ధిపేట సీపీ శ్వేత, ఏసీపీ పై ఫిర్యాదు చేసామని రఘునందర్‌రావు తెలిపారు. అవినీతి కేసులో ఉన్న ప్రభుత్వ అధికారి హరీష్ రావు ఓఎస్డీ, ఏవై గిరి ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వాహనంలో వచ్చి ఏవై గిరి డబ్బులు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో కల్యాణ లక్ష్మి చెక్ లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని, సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అధికారులపై ఫిర్యాదు చేసామని రఘునందర్ రావు పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఉప ఎన్నికల్లో నన్ను ఎంత టార్చర్ చేశారో అందరికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Pragnan: హిందీ సినిమాలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ఓటీటీలో రచ్చ