Kaala Barbarian Chapter 1 Streaming in OTT: ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’ హిందీ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంటోందని ప్రకటించారు మేకర్స్. అహఁయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ర్ఞన్ విలన్‌గా నటించటం విశేషం. ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’లో సైకో పాతల్ర్లో ప్రజ్ర్ఞన్ అద్భుతంగా నటించారని హిందీ మీడియా ఆయన మీద ప్రసంశలు కురిపించింది. ప్రస్తుతం ప్రజ్ర్ఞన్ ఒక తెలుగు సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజ్ర్ఞన్ మాట్లాడుతూ ఈ సినిమాలో చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్ని వేశాలకు ప్రశంసలు వచ్చాయని అన్నారు.. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి ప్రశంసించారని, అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు.
Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
అంతేకాకుండా నేను కొంతమంది దర్శకులకు ఈ సినిమా చూపించినప్పుడు చూసిన వెంటనే తెలుగు సినిమాలో ఒక ప్రముఖ హీరో కి విలన్ గా నటించే అవకాశం దర్శకుడు శ్రీని ఇచ్చారని అన్నారు. మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌కి స్కోపున్న పాత్ర దొరికిందని పేర్కొన్న ఆయన ఒక మంచి నటుడికి ఇంత కంటే కావాల్సిందేముందని అన్నారు. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు ముగించుకోగానే ఈ అవకాశం వచ్చిందని పేర్కొన్న ఆయన నా మొదటి సినిమాకే ఇంత పేరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, అని ఆయన అన్నారు. జింటో చాకో శామ్యూల్ దర్శకత్వం వహించిన కాలా బార్బేరియన్ సినిమాలో వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్తుతి త్రివేది జంటగా నటించగా విలన్ గా ప్రజ్ర్ఞన్ నటించడం విశేషం.