Renu Desai: నేను ఏది ప్లాన్ చేయలేదు.. పవన్ కళ్యాణ్ కు నచ్చి.. నన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని
స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అనుకున్నారు అభిమానులు. కానీ, అంతకు మించి పవన్ కళ్యాణ్ భార్యగా ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయింది. బద్రి టైమ్ లోనే పవన్ ను ప్రేమించి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చి.. ఆ తరువాత పవన్ ను వివాహమాడింది. ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్ గా మారి పవన్ సినిమాల కోసం పనిచేసింది. ఇక కొన్నేళ్లు సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో ఆమె పవన్ కు విడాకులిచ్చి .. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా నివసిస్తోంది. రేణుకు విడాకులు ఇచ్చినా.. తండ్రిగా పవన్ తన బాధ్యతలను ఏరోజు మర్చిపోలేదు. అకీరా, ఆద్యలకు తండ్రిగా వారి చదువుల దగ్గరనుంచి అన్ని.. దగ్గర ఉండి చూసుకుంటూ వస్తున్నాడు. అప్పటినుంచి ఇప్పటివరకు రేణు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించిందే కానీ, సినిమాల్లో కనిపించలేదు. అయితే.. ఇన్నాళ్లకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రేణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
Sree Leela: బాలకృష్ణని చూసి వణికిపోయా.. అంతా డైరెక్టర్ మీదకే తోసేశానంటున్న శ్రీ లీల
Also Read
హీరోయిన్, డిజైనర్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఈ జర్నీ ఎలా వుంది ? అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ” డిజైనర్ విషయంలో మీకో క్లారిటీ ఇవ్వాలి. నేను డిజైనర్ ని కాదు. నేను ఒరిజినల్ స్టైలిస్ట్. డిజైనర్ వర్క్ వేరు. నాకు కలర్స్ పై మంచి అవగాహన వుంది. నేను ఆర్ట్స్ స్టూడెంట్ ని. ఏ కలర్ కు ఏది మ్యాచ్ అవుతుందో నాకు అర్ధమౌతుంది. నేను స్టైలిస్ట్ ని మాత్రమే. స్టైలిస్ట్ కూడా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. ఖుషి సినిమాకి ముందు కళ్యాణ్ గారితో షాపింగ్ కి వెళ్ళినపుడు నా స్టైలింగ్ సెన్స్ ఆయనకి నచ్చింది.సినిమాకు నువ్వే చేసేయ్ అన్నారు. అలాగే సామాజిక కార్యక్రమాలు, కవిత్వం రాయడం, ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చేసినవి కాదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!