BRS MLA Kova Laxmi Throws Water Bottle at Congress Leader Shyam Naik: కొమురం భీం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. స్టేజీ మీద నుంచి వాటర్ బాటిల్‌తో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్యాం నాయక్‌పై దాడి చేశారు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేఖంగా శ్యాం నాయక్ అనుచరులు నినాదాలు చేశారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పందించారు. ‘నేను ఎమ్మెల్యేను. ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంటే అడ్డుంకుంటున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలు నెరవేర్చాలని సమావేశంలో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్యాం నాయక్ అడ్డుపడ్డారు. రాజకీయాలు మాట్లాడవద్దంటూ శ్యాం నాయక్, ఆయన అనుచరులు నాతో వాగ్వాదంకు దిగారు. ఏ అధికారం ఉందని రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ఆయనకు అడిగే అధికారం ఎక్కడిది. అధికారిక కార్యక్రమంలో ఆయనెందుకు పాల్గోనాలి. నన్ను ఎందుకు నిలదీస్తారు. ఆదివాసీ మహిళను అయిన నాపైన దాడి చేయడానికి వచ్చారు. శ్యాం నాయక్ రౌడీలను పట్టుకోని వచ్చారు. మహిళ అని చూడకుండా సిగ్గుశరం అని మాట్లాడాడు’ అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు.
Also Read: MS Dhoni: ఎల్లవేళలా ‘యెల్లో’ జెర్సీతోనే.. ఆసక్తికర విషయం చెప్పిన ఎంఎస్ ధోనీ!
మరోవైపు కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ కూడా స్పందించారు. ‘ఎమ్మెల్యే కోవ లక్ష్మి అవగాహాన రాహిత్యంతో వ్యవహరించారు. ప్రభుత్వంకు వ్యతిరేఖంగా మాట్లాడొద్దన్నాను. అలా ప్రశ్నిస్తే వాటర్ బాటిల్‌తో నాపై దాడి చేశారు. ఎమ్మెల్యే తీరును నేను ఖండిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే లక్ష్మిపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే నోటికి వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడారు’ అని శ్యాం నాయక్ చెప్పారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యాం నాయక్ మధ్య ఘటనతో జన్కాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.