వైసీపీలో పల్నాటి యుద్ధం జరుగుతోంది. కాకుంటే... కత్తులు కటార్లకు బదులు కాస్త మోడ్రన్‌గా సోషల్ మీడియా వార్ చేస్తున్నారు పార్టీ లీడర్స్. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇందుకు వేదిక అవుతోంది.
టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లినవారు.. మళ్లీ తిరిగి వస్తారని తెలిపారు కాసు.. మీరు గ్రామం దాటించారని.. రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.. తెగించే వరకూ తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని హెచ్చరించారు.
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
తనకు ఎవరినీ తొక్కాల్సిన అవసరం లేదని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. బీసీలకు పెద్దపీట వేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి కుటుంబం తమదని, ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగనివ్వనని, ఏ కులాన్ని తొక్కాల్సిన అవసరం తనకు లేదన్నారు. గురజాలలో తాను చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అండదండలు వైసీపీని గెలిపిస్తాయని మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలో ఆశావాహులు ఉన్నారు తప్ప.. అసమ్మతివాదులు లేరుని ఆయన చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే…
Gurazala Mining Issues: కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.. అయితే, పల్నాడు జిల్లాలో కేజీఎఫ్ సినిమా పేరు మార్మోగుతోంది. గురజాల నియోజవర్గంలో కేజీఎఫ్ రేంజ్ లో మైనింగ్ సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. అవన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వైసీపీ…టీడీపీ హయాంలోనే అక్రమ మైనింగ్ సాగిందని ఎదురుదాడికి…