NTV Telugu Site icon

Jagadish Reddy: ఇది భయంకరమైన మోసం.. రైతులు ఐక్యం కావాలని జగదీశ్ రెడ్డి పిలుపు

Jagadish Reddy

Jagadish Reddy

హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు. చివరకు రైతులను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో హింస ప్రేరేపించాలి అని సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీ భయంకరమైన మోసం.. పచ్చి అబద్ధమని విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల తరఫున కొట్లాడుతుందన్నారు. అందరికి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రైతులు ఐక్యం కావాలి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.

READ MORE: Dil Raju: మేమే చెడగొట్టాం… ఓటీటీలపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

కాగా… రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని..హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

READ MORE: KTR: సమావేశం అనంతరం బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. తమ ఉద్దేశాన్ని ప్రకటించిన కేటీఆర్

సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.