Dil Raju Comments on OTT : గత కొన్నాళ్లుగా చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన వారం రెండు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కూడా మూడు, నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇటీవల ఓటీటీ డీల్ ముందే ఓకే అయ్యాక సినిమా మొదలు పెడుతున్నారు కొంత మంది. దీంతో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అంతంత రేట్లు పెట్టుకొని థియేటర్ కి వెళ్లడం ఎందుకని చాలా మంది థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు. దానికి తోడు ఈ పాప్ కార్న్, కూల్ డ్రింకుల బాదుడు ఉండనే ఉంది. ఈ అంశం మీద దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేసాడు.
Jyothi Poorvaaj: ‘బిగ్ బాస్’లోకి హాట్ ఆంటీ?
చిన్న సినిమా ‘రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు పాల్గొని మాట్లాడుతూ.. చిన్న సినిమా అని వదిలేయకండి. థియేటర్ కి వెళ్లి చూడండి, ఇటీవల చాలా మంది థియేటర్ కి వచ్చి సినిమాలు చూడట్లేదు. అసలు ఆడియన్స్ ని మేమే చెడగొట్టాము, మీరు ఇంట్లోనే కూర్చోండి, నాలుగు వారాల్లో సినిమా ఓటీటీలోకి వస్తుంది అని మేమే వాళ్ళని చెడగొట్టి ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా చేసుకున్నామని అన్నారు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రేవు. రేవు చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఆగస్టు 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ట్రైలర్ లాంచ్ చేయగా ఆ ఈవెంట్‌కి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు.