AP Assembly: అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..
- ఏపీ అసెంబ్లీకి భారీగా తగ్గుతోన్న ఎమ్మెల్యేల హాజరుశాతం..
- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూడా పెరగని హాజరు శాతం..
- ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండానే సభ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.. అయితే, అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు సభకు హాజరైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే.. అసెంబ్లీ సమావేశాలను వాకౌట్ చేసి వెళ్లిపోయారు.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. సభలో 164 మంది సభ్యులు ఉండాలి.. కానీ, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు శాతం భారీగా తగ్గిపోయింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా.. అసెంబ్లీకి రావడం లేదు ఎమ్మెల్యేలు.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటు వరకు బిజీగా ఉన్నారని భావించినా.. ఆ తర్వాత కూడా హాజరు శాతం తగ్గింది.. ఒక్కోసారి 60 మంది సభ్యులు కూడా లేకుండా సభ నడుస్తోంది..
Read Also: Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు
Also Read
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
వైసీపీకి చెందిన 11 మందిని మినహాయిస్తే మొత్తంగా 164 మంది సభ్యులు ఉండగా.. ఎలాంటి పరిస్థితి అయినా కూడా 100 మంది తగ్గకుండా హాజరు కావాల్సిన పరిస్థితి.. కానీ, ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది.. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యలు మరింత ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు సభకు వస్తే.. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు.. అది కాకుండా.. ఆయా నియోజకవర్గాల సభ్యులు వచ్చినా.. తమ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను లేవనెత్తవచ్చు.. కానీ, క్రమంగా సభ్యుల హాజరు శాతం తగ్గడం ఇప్పుడు చర్చగా మారిపోయింది..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!