టాలీవుడ్ హీరో విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, హేమాహేమీలు వంటి పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్నారు.
Also Read : Eega : మళ్ళీ వస్తున్న ‘ఈగ’.. కానీ దర్శకుడు జక్కన్న కాదు
ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో కన్నప్ప టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే తాజాగా విష్ణు మంచు ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో పంచుకున్నారు. తాము ఈ సినిమా కోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని డిస్కషన్లు జరిపామో, ఎంత హార్డ్ వర్క్ చేశామో ఈ వీడియో ద్వారా విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి తాను 24 క్రాఫ్ట్స్ తో ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ వీడియోలో స్పష్టంగా వెల్లడించారు. వీడియో చూస్తుంటే మూవీ కోసం ఇంత కష్టపడ్డారో అర్ధం అవుతుంది. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.