AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలు వివాదంగా మారాయి.. దీనిపై పాలక, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుండగా.. డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. బాధితులు భయపడుతున్నారనే వాదనతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేసింది.
డీఎస్సీ నోటిఫికేషన్, నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటికే 335 పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తుచేసింది. దీంతో న్యాయపరమైన పరిష్కారానికి కోర్టు తలుపులు అందరికీ తెరిచి ఉన్నాయని పరోక్షంగా సూచించింది ఏపీ హైకోర్టు.. ప్రజాహిత వ్యాజ్యం (పిల్) అనేది విలువైన న్యాయ సాధనమని పేర్కొన్న ధర్మాసనం, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తే.. పిల్ అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. మొత్తంగా.. ఏపీలో డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు స్వయంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించిన ధర్మాసనం, వారు భయపడుతున్నారనే వాదనను అంగీకరించలేదు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!