North Korea: కిమ్ కోపానికి కరిగిపోయిన ఐస్ క్రీం.. దెబ్బకు పేరు మారిపోయింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: తన నిర్ణయాలతో సంచలనాలు సృష్టించే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ సారి కిమ్‌కు ఐస్ క్రీంపై కోపం వచ్చింది. అక్కడ ఉంది సాక్షాత్తు ఉత్తర కొరియాకు మకుటం లేని మహారాజు. ఆయనకు కోపానికి ఐస్ క్రీం కరిగిపోయింది. ఇకపై ఆదేశంలో ఐక్ క్రీం అనే పదం వాడుకలో ఉండదు.. సరేగానీ ఇంతకీ నార్త్ కొరియాలో ఇక నుంచి ఐస్ క్రీం పేరు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: YS జగన్ : మీ ఘనత ఎవరికీ సాధ్యం కాదు,.. సీఎం చంద్రబాబుపై జగన్ ట్వీట్ !
Also Read
ఉత్తర కొరియా రాజకీయాల్లో ఐస్ క్రీం మంటలు పెట్టింది. ఐస్ క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదం. కానీ ఇకపై ఉత్తర కొరియాలో ఆ పదం ఏమూల కూడా వినిపించకూడదని స్వయాన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ఈ పదానికి బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని తాజా ఆ దేశ నియంత ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్. డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. ఉత్తర కొరియా ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని వినికిడి. ఇందులో భాగంగా దేశ టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది.
ఐస్ క్రీమ్‌కి మాత్రమే పరిమితం కాలేదు..
కిమ్ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై టూర్ గైడ్లు అసహనం వ్యక్తం చేస్తూనే.. వారు శిక్షణ పొందుతున్నారు. ఆగస్టు 21వ తేదీన మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఇలా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుంచి దూరంగా ఉంచినట్లు కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కిమ్.. సంచలన నిర్ణయాల్లో కొన్ని
* మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్వర్క్లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నార్త్ కొరియాలో నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడంపై ఇక్కడ నిషేధం ఉంది.
* హాట్ డాగ్‌పై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్ డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం ఈ దేశంలో నిషేధించారు. దీనిని ఇక్కడ “దేశద్రోహం”గా పరిగణిస్తారు.
* విదేశీ వినోదం, మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని “ఆన్టీ-సోషలిస్టు” చర్యగా పరిగణించి కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
* జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు గత పాలకులు కిమ్ ఇల్-సంగ్, కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదు.
* బుదాయ్-జిగే నిషేధం: దక్షిణ కొరియా నుంచి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.
* వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది “ఆన్టీ-సోషలిస్టు” చర్యగా అభివర్ణించారు. అలాగే ఆధ్యాత్మిక స్వేచ్ఛపై, మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను ఈ దేశంలో పూర్తిగా నిషేధించారు.
* హెయిర్టెల్, లెదర్ జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్టెల్లు చేసుకోవడం నేరంగా పరిగణిస్తారు. దేశంలో ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైలే పౌరులు చేసుకోవాలి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్ ఫాలో అయినా కూడా నేరమే.
* అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ -సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు.
READ ALSO: September 17: ఆ రోజు అసలు ఏం జరిగింది.. నిజమైన చరిత్ర ఏంటి?
తాజావార్తలు
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!