YSRCP: దొంగ ఓట్లపై చంద్రబాబు ఫిర్యాదు హాస్యాస్పదం.. పవన్ గురించి మాట్లాడడం సమయం వృథా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది.. ఏకంగా ఢిల్లీ వరకు చేరింది.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అధికార, ప్రతిపక్ష నేతలు పోటీపోటీగా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేశారు.. దొంగ ఓట్లు ఎలా చేర్చుతున్నారు.. విపక్షాల ఓట్లు ఎలా తొలగించారో ఆధారాలతో సహా ఈసీకి ఇచ్చామని చంద్రబాబు చెబితే.. అసలు చంద్రబాబు హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారు.. వాటితోనే ఆయన విజయం సాధించారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది వైసీపీ.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఉషాశ్రీ చరణ్.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లను నమోదు చెయ్యించింది చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే అని ఆరోపించారు. దొంగ ఓట్లుపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు..
Read Also: Mrunal Thakur:మత్తు లో పడేస్తున్న మృణాల్ ఠాకూర్
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో చంద్రబాబు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు ఉషాశ్రీ చరణ్.. రాబోవు ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. జగనన్న మళ్లీ సీఎం కాబోతున్నారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్. మరోవైపు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చంద్రబాబు దొంగ ఓట్లతో విజయం సాధించారని ఆరోపించారు.. దొంగ ఓట్లను తొలగించాల్సిందే.. అర్హత ఉన్నవారి ఓట్లను కొనసాగించాల్సిందే అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడడం అంటే.. సమయం వృథా చేసుకోవడమే అని ఎద్దేవా చేశారు మంత్రి నాగార్జున. కాగా, ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారి తీసింది.. మీ హయాంలోనే దొంగ ఓట్లు నమోదు చేశారంటే.. మీ హయాంలోనే మాకు అనుకూలంగా ఓట్లను తొలగిస్తున్నారంటూ పరస్పర విమర్శలకు దిగుతున్నారు అధికార, ప్రతిపక్ష నేతలు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!