ఈ మధ్య ఆయా దేశాల్లో జననాల రేటు తగ్గిపోతున్నాయి. దీంతో బిడ్డల్ని కనేందుకు తల్లులకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల చైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇక దక్షిణ కొరియాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పాడ్డాయి. అక్కడ కూడా జనాభా తగ్గిపోతుంది. దీంతో దక్షిణ కొరియా ప్రభుత్వం (South Korea).. ఇతర ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన బూయోంగో అనే నిర్మాణ సంస్థ (Booyoung Group) కూడా బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది.
బిడ్డకు (Child Cash) జన్మనిచ్చిన ఉద్యోగులకు బోనస్‌గా బూయోంగో అనే నిర్మాణ సంస్థ రూ.62 లక్షలు చెల్లిస్తోంది. 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.43.65 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ తెలిపింది. మహిళలు, పురుషులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. జన్మనిచ్చిన ప్రతీసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.