గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులు అప్పగించలేదని తెలిపారు. ఎక్కడి నుండో మినిట్స్ తెచ్చి సమాధానం చెప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండానే కేఆర్‌ఎంబీ సమావేశం ముగిసింది. నదీ జలాల కేటాయింపు న్యాయబద్ధంగా జరగాలని తెలంగాణ వాదిస్తే.. 66:34 నిష్పత్తిలో ఉండాలని ఏపీ వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్రం తొమ్మిదేళ్ల నుంచి నీటి వాటాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది.
కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్‌లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని…
కృష్ణ బోర్టుకు చెందిన సభ్యులు రెండవ రోజు నాగర్జున సాగర్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ అధికారులతో కేఆర్‌ఎంబీ బృంద సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం కేఆర్‌ఎంబీ బృంద సభ్యులు మాట్లాడుతూ.. సాగర్ స్థితిగతులు తెలుసుకొని రూట్‌మ్యాప్ తయారీ చేసినట్లు వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ పరిశీలించి నివేదికలు పంపుతామని తెలిపారు. నాగార్జున సాగర విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించలేదని, వచ్చే పర్యటనలో విద్యుదుతప్పత్తి కేంద్రాలు పరిశీలించి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. కృష్ణ జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారన్నారు. ఈ అంశంపై కేసీఆర్ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉన్నందున మేము నిర్ణయం తీసుకోలేమని చెప్పామన్నారు. దీంతో రెండు రోజుల్లో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని తెలిపి.. 8 నెలలకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారన్నారు. పిటిషన్…
కేఆర్ఎంబి చైర్మన్ కు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ మరో లేఖ రాశారు. ఈ నెల 9న జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఈ లేఖలో తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోరారు. ఈ నెల 9న జలసౌధాలో కేఆర్ఎంబీ చైర్మన్ ఆర్పీ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉండనుంది. read aslo : చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం అయితే… దీనిపై అభ్యంతరం చెప్పిన…