ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ విడుదల చేసింది. ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది.
రెండో విడత పంట రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.