నియోజకవర్గ మార్పుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కన్నీటిపర్యంతం అయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రిని గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత కన్నీళ్లు పెట్టుకున్నారు.