Manda Krishna Madiga: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్‌దారులను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు.
ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోందని తెలిపారు. అయితే దాసరి మల్లమ్మ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం(ANM) గా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ. 24,073 పెన్షన్ మల్లమ్మకు అందుతోందని మంత్రి పేర్కొన్నారు.