Bharateeyudu 2 Team Trims 20 Minutes from First Copy from Today: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా 96 లో రిలీజ్ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి చాలా కాలం తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేసి పట్టాలెక్కించారు. అయితే అనూహ్య కారణాలతో 2019లో ప్రారంభమైన ఈ సినిమా 2024 లో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. చాలామంది బాలేదని అంటుంటే కొంతమంది పర్వాలేదని అంటున్నారు. అయితే మొత్తం మీద కలెక్షన్స్ మీద భారీగా ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో టీం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి మూడు గంటల నిడివి ఉండేది. ఆ మేరకే సెన్సార్ కూడా చేయించారు.
Raj Tarun- Lavanya: లావణ్య-రాజ్‌తరుణ్ వివాహం.. పోలీసులకు ఆధారాలు సబ్మిట్ చేసిన లావణ్య
కానీ అంతసేపు ఉంచడం వల్ల ప్రేక్షకులకి లాగ్ ఫీలింగ్ కలుగుతుందని భావించి ఇప్పుడు తాజాగా సుమారు 20 నిమిషాల ఫుటేజ్ ట్రిమ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ట్రిమ్ చేసిన కట్ తోనే ఈరోజు సాయంత్రం నుంచి షోలు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించి తమిళనాడులో టికెట్ రేటు అత్యధికంగా 190 రూపాయలు వసూలు చేస్తుంటే తెలుగు రాష్ట్రాలలో మాత్రం అత్యధికంగా 390 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక మిశ్రమ స్పందన నేపద్యంలో నిడివి విషయంలో అయితే నిర్ణయం తీసుకుంది సినిమా యూనిట్. మరి సినిమా టికెట్ రేట్లు తగ్గింపు విషయం మీద కూడా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సిద్ధార్థతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బాబీ సింహ, సముద్రఖని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రల్లో నటించారు.