ఆసరా పెన్షన్‌ను తిరిగి చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి అధికారులు నోటీసులు ఇవ్వడంపై మంత్రి సీతక్క స్పందించారు. కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోందని తెలిపారు. అయితే దాసరి మల్లమ్మ కుమార్తె రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం(ANM) గా పనిచేస్తూ మరణించగా, ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ. 24,073 పెన్షన్ మల్లమ్మకు అందుతోందని మంత్రి పేర్కొన్నారు.