Minister Seethakka : అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతాం
- మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం
- పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది
- అందుకే హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారు: మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది. అందుకే కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారన్నారు. మీ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదని విషయం మహిళలందరికీ తెలుసు అని, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మహిళలు అప్పుల పాలవుతున్నారు.. ఆగం అవుతున్నారని హరీష్ రావు ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళా సంక్షేమం పట్ల మీది దరిద్రమైన పాలన అని ఆమె మండిపడ్డారు. మీ పాలనలో మీ ఆడబిడ్డ కవిత ఒక్కరే ఎదిగారన్నారు మంత్రి సీతక్క. బతుకమ్మ వేడుకలు అయినా, బీసీ ఉద్యమం అయినా, మహిళా ఉద్యమమైనా కవితే హైజాక్ చేస్తారన్నారు. కవిత తప్ప ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అన్నది టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకే లక్ష మంది తరలివచ్చి మహిళా సభను సక్సెస్ చేస్తే మీరు ఓర్వ లేకపోతున్నారని, మీరు ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు 3485 కోట్లు చెల్లించాల్సి ఉండగా..కేవలం 409 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు మంత్రి సీతక్క.
Bhopal: కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు
Also Read
అంతేకాకుండా..’హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చివరి మూడేళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైస చెల్లించలేదు.. మహిళలకు మూడేళ్లు గుండు సున్నా పెట్టి పోయారు.. వేల కోట్ల వడ్డీలు చెల్లించకుండా మహిళలను మోసం చేశారు.. ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసుకున్న అభయహస్తం డబ్బులను దిగమింగిన చరిత్ర మీది.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకు పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించాము.. ఈ ఏడాదికి సంబంధించి వడ్డీలు మహిళలకు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది.. ప్రమాదవశాత్తు మహిళా సంగం సభ్యురాలు మరణిస్తే ప్రమాద బీమా ఇవ్వాలన్న ఆలోచన మీరు చేయలేదు.. కానీ నేను మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా పది లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లిస్తున్నాం.. ఇప్పటికే 400 మంది మహిళలకు 40 కోట్లకు పైగా చెల్లిస్తున్నాం.. మహిళా సంఘాల పట్ల ఇది మా చిత్తశుద్ధి.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా హరీష్ రావు వ్యవరిస్తున్నారు.. అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతాం.. ఎవరు మహిళా సంక్షేమం కోసం కోసం ఎంత చేశారు తేలుస్తాం… మహిళా సంఘాలను పంపించిన మీకు మహిళా సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదు… ప్రజా ప్రభుత్వంలో మహిళలు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు.. ఒక లక్ష్యం నిర్దేశించుకుని మహిళలను కోటీశ్వరులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం… నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఆర్థిక చేయుట అందించి మహిళలను ఎన్నో వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నాం.. మహిళలకు ఏం చేయడం లేదని రెచ్చగొట్టడమే మీ పని… మహిళల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..