CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
- పాలమూరు అభివృద్ధిపై కేసీఆర్‌కు చురకలు
- కేటీఆర్‌పై సీఎం ఘాటు వ్యాఖ్యలు
- డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు
- ప్రజాబలంతో సునామీ సృష్టిస్తామన్న రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల కొడంగల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటన ముగింపులో భాగంగా లగచర్ల నుంచి రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. లగచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి, పాలమూరు వలసలు , ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పాలమూరుకు పదేళ్లు కక్షగట్టి అన్యాయం చేశారు
బూర్గుల రామకృష్ణారావు కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పొలాలకు నీళ్లు అందలేదని తెలిపారు. తెలంగాణ వస్తే కష్టాలు తీరుతాయని కేసీఆర్‌ను గెలిపిస్తే.. ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు జిల్లా గుండెలపై తన్ని గజ్వేల్‌కు పోయాడని విమర్శించారు. పదేళ్ల పాటు పాలమూరు అభివృద్ధిని కక్షగట్టి అడ్డుకున్నారని, అయితే 2023లో ముక్కోటి దేవతల ఆశీస్సులతో కొడంగల్ బిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. తానూ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
Also Read
- Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
- Telangana Egg Donation Scam : రూ.30 వేల ఆశ చూపించి.. 50 మంది యువతుల జీవితాలతో ఆటలు
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- Siddipet Fake Death Certificate Scam: బతికున్నోళ్లను చంపేశారు.. 22 నకిలీ డెత్ సర్టిఫికెట్లతో స్కామ్
పది జన్మలెత్తినా కేటీఆర్.. రేవంత్ రెడ్డి కాలేడు
కేసీఆర్ పాలనలో రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని, తమకు అప్పులు చేసే అలవాటు కానీ, అబద్ధాలు చెప్పే అలవాటు కానీ లేవని సీఎం వ్యాఖ్యానించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కడుపుమంటగా ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టింది, బుద్ధి రావడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో! పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క ఎప్పటికీ పులి కాదు. గడ్డం మోకాళ్ల వరకు పెంచుకున్నా కేటీఆర్ ఎప్పటికీ రేవంత్ రెడ్డి కాలేడు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ కావాలి” అని ఎద్దేవా చేశారు.
డిసెంబర్ నాటికి కొడంగల్‌కు కృష్ణా జలాలు
ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ వెళ్తామని, ఈ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్ బీడు భూములను తడిపి పచ్చని పంటలు పండిస్తానని పోలేపల్లి ఎల్లమ్మతల్లి సాక్షిగా ప్రమాణం చేశారు. ఒకప్పుడు చదువుకోడానికి పక్క జిల్లాలకు వెళ్లే పరిస్థితి నుంచి, నేడు రూ. 9,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ప్రజాబలంతో సునామీ సృష్టిస్తాం.. ఢిల్లీ మోదీనైనా, కేడీనైనా ఎదిరిస్తా
ఉద్యోగుల కష్టాలు గుర్తించి 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా మొదటి తారీఖున 11 లక్షల మంది ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఈ 34 నెలల్లో రూ. 2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు కట్టామని చెప్పారు. కొడంగల్ ప్రజల అండ ఉంటే ఢిల్లీలో మోదీనైనా, ఇక్కడ కేడీనైనా ఎదిరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ పేరుతో ప్రజల్లోకి వస్తామని, ఆ ప్రజాబలంతో సునామీ సృష్టిస్తే మోడీ, కేడీలు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. చివరగా, జర్నలిస్టులు ఎవ్వరూ అధైర్యపడొద్దని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేటీఆర్‌పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!