Minister Seethakka: కళ్ళు లేని వారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని.. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మలక్ పేట్ దివ్యాంగులు భవన్ లో ఘనంగా లూయిస్ బ్రెయిలి 215 జన్మదిన వేడుకలకు సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా అంథుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తో రూపొందించిన ల్యాప్ టాప్ లు, ఫోన్ లను అంథులకు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్ళు లేని వారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని అన్నారు. లూయిస్ బ్రెయిలి జీవితంను అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లిపి కనుక్కోని కళ్ళు లేని వారికి బ్రెయిలి కనుచూపు అయ్యారని తెలిపారు. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదన్నారు. చిన్న తనంలో కళ్ళు పోగోట్టుకుని సంఘర్షణ ద్వారా బ్రెయిలి లిపి కనుగొన్నారని అన్నారు. అన్ని రకాల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. అంథులు సరైన బస్ స్టాప్ లలో దిగేవిధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేవిధంగా రవాణాశాఖ మంత్రితో మాట్లాడుతా అని తెలిపారు. అంథుల రిజర్వేషన్ పై ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్ లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
Read also: Hyundai Creta facelift: క్రెటా ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. లాంచ్, ధర, ఫీచర్ల వివరాలు ఇవే….
మహిళలు, అనాథలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.. ఆ శాఖపై ఆమె సమీక్ష నిర్వహించి వారికి శుభవార్త అందించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అనాథ పిల్లలకు రెండు శాతం కోటా కేటాయించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనాథలను దత్తత తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని.. నిబంధనలు కఠినంగా ఉన్నందున ఎక్కువ మంది ముందుకు రావడం లేదని సీతక్క తెలిపింది. ఈ నేపథ్యంలో దత్తత నిబంధనలను సరళతరం చేయాలని అధికారులకు ఆమె సూచించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే మహిళల కోసం ముఖ్యమైన పెద్ద నగరాల్లో మహిళా సంక్షేమ శాఖ తరఫున హాస్టళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. దీంతో పాటు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలి. అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టతకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్ వాడీల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటుపై అధికారులు ఆలోచించాలన్నారు.
Karsevak Arrest: కరసేవకుల అరెస్ట్ పై బీజేపీ నేతల ఆందోళన