ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అలాగే కోలీవుడ్‌లోను భారీ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సరసన మరో ఛాన్స్ దక్కించున్నట్టు తెలుస్తోంది.. ఈ అమ్మడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.. ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్‌బో’ అనే ఓ లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. మరో వైపు బాలీవుడ్‌లోను వరుస సినిమాలు చేస్తోంది. ఇప్పటికే గుడ్ బై, మిస్టర్ మజ్ను చిత్రాలతో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఇక త్వరలోనే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది. ఇక ఈసినిమాలతో పాటు ఇంకా కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ సరసన ‘వారిసు’ సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పుడు మరో కొలీవుడ్ మాస్ హీరో ధనుష్ తో సినిమా చేయనుందని తెలుస్తుంది..
మరో యంగ్ హీరో ఫైనల్ అవాల్సి ఉంది. ధనుష్ నటిస్తున్న 15 వ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా ఫైనల్ అయిందని సమాచారం. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శత్వం వహించనున్నారు.. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు కానుందని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.. ఆల్రెడీ రష్మిక మందన్న చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.. దీంతో రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోందని చెప్పొచ్చు. అయితే.. ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న సినిమా నుంచి మాత్రం తప్పుకుంది అమ్మడు.. హిందీలో కూడా ఫుల్ బిజీగా ఉందని తెలుస్తుంది..