ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. నా 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చిన దుఃఖం ఏ కుటుంబానికీ రాకూడదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. మహిళల కళ్లల్లో ఆనందం చూసేందుకే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయం. పొరుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న తీరు పై ముందుగా అధ్యయనం చేస్తాం. అక్కడి లోటు పాట్లు లేకుండా ఎవరికీ కష్టం రాకుండా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం. శారీరకంగా మానసికంగా దృడంగా ఉండాలంటే అందరికీ క్రీడలు చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ క్రీడలను చేరువ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.
Bihar : పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చిన తండ్రి.. ఆక్సీజన్ పెట్టాలంటూ ఆందోళన
విద్యార్థులను క్రీడలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత ఐదేళ్లలో ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. యువతకు నైపుణ్యత కల్పించేలా మా శాఖ ద్వారా చర్యలు తీసుకుంటాం. నాకు అప్పగించిన బాధ్యతలకు మేలు చేసి మంచి పేరు తీసుకువస్తాం. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఏ రోడ్డుకూ పిడికెడు మట్టి వేసిన పాపాన పోలేదు. గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవు.. త్వరలోనే రోడ్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం ఆర్టీసీని సగం విలీనం చేసి సమస్యలు తీర్చలేదు. రాబోయే రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిగా విలీనం చేస్తాం. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు మాకు రెండు కళ్లు. గత ఐదేళ్లలో అప్పటి ప్రభుత్వం ఒక్క కొత్త బస్సును కొనలేదు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతుంది. ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెడతాం. కాలుష్యం తగ్గించేందుకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని., గత లో ఐదేళ్లలో ఆర్టీసీ స్థలాలను కొందరు కాజేశారు. ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటాం. అక్రమంగా కేటాయించిన ఆర్టీసీ ఆస్తులను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Etala Rajender: బీజేపీలో కలకలం.. రాజాసింగ్ కు ఈటెల ఘాటు రిప్లై..
గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ప్రజల రక్త మాంసాలు తినింది. ఆర్టీసీ బస్సులు సహా స్టాఫ్ పెరగాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం కార్మిక సంఘాలను ఛిన్నాబిన్నాం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు మాకు రెండు కళ్లు. ఉద్యోగులకు మంచి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీలో కొత్తగా డ్రైవర్లు సహా సిబ్బందిని నియామకాలకు చర్యలు తీసుకుంటాం. ఆడుదాం ఆంధ్ర పేరిట గతప్రభుత్వంలో కొందరు అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. డబ్బులు తిన్న వారిపై విచారణ జరుపుతాం. అక్రమార్కులను ఊచలు లెక్కపెట్టిస్తాం. గత ప్రభుత్వంలో క్రీడల పేరిట నేతలు తిన్న డబ్బంతా కక్కిస్తాం. ప్రతి దానికీ అకౌంటబులిటీతో పారదర్శకంగా పరిపాలన చేస్తామని ఆయన తెలిపారు.