కేంద్రం సహాయంతో అయిదేళ్లలో ఆర్టీసీ (RTC)లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామని..త్వరలోనే 1400కొత్త బస్సులు రాబోతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. నా 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చిన దుఃఖం ఏ కుటుంబానికీ రాకూడదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. మహిళల కళ్లల్లో ఆనందం…