Minister Ramprasad Reddy: డీజిల్ బస్సులకు గుడ్‌బై చెబుతున్నాం.. ఇకపై కొనే ప్రతి బస్సు ఎలక్ట్రిక్ బస్సే ఉంటుందన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. విశాఖ ద్వారక ఆర్టీసీ బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో అందిస్తున్న సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. బస్సుల లభ్యత, శుభ్రత, టికెట్ వ్యవస్థ వంటి అంశాలపై ఆయన ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ముఖ్యంగా ఫ్రీ బస్సు పథకం పై…
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు ఏపీ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. నా 11 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ప్రమాదాల్లో కుటుంబ సభ్యుడిని కోల్పోతే ఆ కుటుంబం పడే బాధ ఏంటో నాకు తెలుసు. నాకు వచ్చిన దుఃఖం ఏ కుటుంబానికీ రాకూడదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కచ్చితంగా తీసుకుంటాం. మహిళల కళ్లల్లో ఆనందం…