గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల పై ఈటెల రాజేందర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలన్న రాజాసింగ్ మాటలకు ఈటెల గట్టిగ రిప్లై ఇచ్చారు. ఏ ఫైటర్ కావాలా, స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ ఈటల రిప్లై ఇచ్చారు. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన
సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలన్నారు. సందర్భం వస్తె జెజమ్మతో కొట్లాడేటోల్లం అంటూ ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Koppula Eshwar: ఎవరికోసం సింగరేణిని వేలం వేస్తున్నారో కేంద్రం చెప్పాలి..?
బీజేపీ రాష్ట్ర నూతన చీఫ్ నియామకంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్‌ను కోరారు. దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వ్యక్తినే రాష్ట్రపతిగా నియమించాలి. ఇదే విషయాన్ని ఓ వీడియో ద్వారా బీజేపీ నాయకత్వానికి సూచించారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇతర సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read also: Animal Smuggling : బెజవాడ కేంద్రంగా వైల్డ్ లైఫ్ యానిమల్ స్మగ్లింగ్..
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుని ఊపందుకుంటున్న బీజేపీ.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించనున్నారు. కొత్త వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అయితే దీనిపై ఈటెల రాజేందర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.