Peddireddy Ramachandra Reddy: పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్.. ఆ డబ్బులన్నీ బాబు, ఆ పార్టీ వారికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడ తరలిస్తున్నారు.. సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించారని గుర్తుచేశారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. 90 శాతం సిమెన్స్, 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేయాలి.. రూ.3,356 కోట్ల ప్రాజక్ట్ లో రూ.371 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి.. ఏ కారణం లేకుండా ఒక కంపెనీ ప్రభుత్వం తరపున రూ.3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీ అరెస్టులు చేశాయి అని తెలిపారు.
సీమెన్స్, డిజిటెక్, స్కిల్లెర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు.. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు… సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించిన ఆయన.. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదలాయించారు.. ఆ డబ్బులు అన్ని చంద్రబాబుకు, ఆ పార్టీ వారికే చేరాయన్నారు. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే.. అయన ఈ విషయంపై ఏమి మాట్లాడలేదని దుయ్యబట్టారు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే.. చంద్రబాబు.. సీఐడీని నిలదీశారని ప్రచారం చేసుకుంటున్నారు.. ఐటీ నోటీసులు ఇస్తే.. ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డగోలు వాదనలు చేశారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
ప్రభుత్వ ధనాన్ని దోచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి.. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిందన్న ఆయన.. చంద్రబాబు బంధువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ ఎవ్వరూ ఈ విషయంలో నోరు మెదపడం లేదు ఎందుకని నిలదీశారు. ఓటుకు నోటు కేసులోనే అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు.. ఆనాడు కూడా కొందరు చంద్రబాబుకు మద్దతు తెలిపారు.. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా ఆ సంస్థలు అదే పని చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు.. సీఐడీ ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని అరెస్ట్ చేశారని వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ లో కూడా అవకతవకలు జరిగాయి.. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారని.. పురంధేశ్వరి ఈ రూ.371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా లేరు.. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే.. పోలీసులు అడ్డుకున్నారని.. ఆ రోజు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగిందని.. అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరు అంటూ ఎద్దేవా చేశారు.. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు.. ఇప్పుడు చంద్రబాబు మన్నన కోసం పని చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?